బాలీవుడ్ వివాదాస్పద హీరోయిన్ కంగనా రనౌత్ కి కేంద్ర ప్రభుత్వం వై క్యాటగిరీ సెక్యూరిటీ అందించనున్నట్టు సమాచారం. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రికమెండ్ చేసిన క్రమంలో ఆమెకు ఈ సెక్యూరిటీ ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చినట్టు చెబుతున్నారు. నిజానికి కంగనాకి మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల కంగనా రనౌత్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో ముంబైని పోలుస్తూ చేసిన వ్యాఖ్యానాలతో అధికార శివసేన నేతలు ఫైర్ అవుతున్నారు.
అహ్మదాబాద్‌ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చగల ధైర్యం కంగనా రనౌత్‌కు ఉందా అని శివసేనకు చెందిన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఆమెను ముంబైలో అడుగు పెట్టనివ్వమని ఆయన పేర్కొన్నారు. కంగనా కూడా వెనక్కి తగ్గకుండా తాను ముంబై వస్తానని ఎలా ఆపుతారో చూస్తానని పేర్కొంది. ఈ కామెంట్స్ నేపధ్యంలో కంగనా రనౌత్ సెప్టెంబర్ 9 న ముంబై పర్యటన కోసం వెళ్లనుంది. ఈ క్రమంలో కంగనా రనౌత్‌కు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ అన్నారు. అయితే కేంద్రాన్ని ఆమె భద్రత కోసం కోరగా వై క్యాటగిరీ సెక్యూరిటీ అందించడానికి సిద్దం అయింది.