మారిటోరియం పై కేంద్రం తాజాగా మరో అఫిడవిట్ దాఖలు చేసింది. అసలు ఇంకేమాత్రం ఉపశమనం ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. నిజానికి గత వారం ఇదే అంశం మీద విచారణ జరగగా సుప్రీం ధర్మాసనం సంతృప్తి చెందలేదు. స్పష్టంగా చెప్పాలని గత వారం సుప్రీం ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. కేవలం 8 రకాల బ్యాంకు రుణాలకే వడ్డీ పై వడ్డీ రద్దుకు అంగీకరించింది. ఇక వచ్చే మంగళవారం ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరుగుతుంది.
రంగాల వారీగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదన్న కేంద్రం, ఆర్ధిక పరమైన విధాన నిర్ణయాలు తీసుకొనేది ప్రభుత్వాలు కానీ, కోర్టులు కాదని నిన్న జారీ చేసిన అఫిడవిట్ లో స్పష్టం చేసిన కేంద్రం. మార్చి నుంచి ఆగష్టు వరకు నెలవారి రుణ చెల్లింపుల విషయంలో మాత్రమే వడ్డీ పై వడ్డీ మాఫీ చేస్తామని తెలిపింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాలు, విద్యా రుణాలు, గృహరుణాలు, వాహన రుణాలు, క్రెడికార్డుల రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఫ్రొఫెషనల్ రుణాలకు వడ్డీ పై వడ్డీ మాఫీ చేయనున్నారు.