హ్యాండ్ శానిటైజర్ ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్కాహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ల ఎగుమతిపై ప్రభుత్వం అన్ని ఆంక్షలను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం చెప్పింది. డిస్పెన్సెర్ స్ప్రే కంటైనర్ లో ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ ల ఎగుమతి కి అనుమతులు ఇచ్చింది.
ఏ రూపంలోనైనా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ లను ఎగుమతి చేయడానికి అనుమతి ఇస్తున్నామని చెప్పింది. ఈ మేరకు ఉచిత అనుమతులు ఇస్తామని కేంద్రం చెప్పింది. కాగా కరోనా వైరస్ విస్తరించిన తర్వాత మన దేశంలో వాటి వాడకం విస్తృతంగా పెరిగింది. అన్ని దేశాల కంటే జనాభా మన దేశంలో ఎక్కువగా ఉండటంతో శానిటైజర్ లను ఎక్కువగా తయారు చేస్తున్నారు.