దేశంలో ఆగస్ట్ 15 వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. వివిధ దేశాల నుంచి కూడా అతిధులు వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి అని చెప్పాలి. కాని ఈ సారి మాత్రం అంత సినిమా లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. వీవీఐపీ లు కేవలం 20 శాతం మంది మాత్రమే హాజరు అవుతారు అని అదే విధంగా విద్యార్ధులు గాని స్థానిక పిల్లలుగాని ఎవరూ హాజరయ్యే అవకాశం లేదు అని తెలుస్తుంది.
అయితే పిల్లలు లేనప్పటికీ, ఎర్రకోటలో జరిగే వేడుకలకు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ క్యాడెట్లు హాజరవుతారని తెలుస్తుంది. ఇక కరోనా విజేతలు 1500 మంది ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది అని సమాచారం. స్థానిక పోలీసులు 500 మంది ఉంటారు అని వివిధ ప్రాంతాలకు చెందిన వెయ్యి మంది ఉంటారు అని అంటున్నారు. 2 వేల మంది లోపే ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది అని సమాచారం.