ఎస్బీఐ ఉద్యోగులు ఇక వర్క్ ఫ్రమ్ ఎనీ లొకేషన్…!

-

కరోనా వైరస్ ఈ దేశంలో తీవ్రంగా వ్యాపిస్తోంది. దీనితో ఇప్పటికే చాలా సంస్థలు ఇంటి నుంచి పని చేసే విధానాన్ని అమలు చేశారు. అయితే దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో అడుగు ముందుకేసింది. ఇందులో ఎస్బీఐ ఉద్యోగులు ఎక్కడినుంచైనా పనిచేసే వ్యవస్థను తీసుకు రానుంది.

sbi
sbi

వర్క్ ఫ్రమ్ ఎనీ లొకేషన్ అని ఎస్బీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు వినియోగదారుల కోసం కాంటాక్ట్ లెస్ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందించనుంది. వినియోగదారుల్ని, ఉద్యోగులను కాపాడుకునేందుకు ఈ మార్పు చేయనుంది. ఈ చర్యల ద్వారా సంస్థకు కనీసం రూ. 1000 కోట్లు మిగులుతాయి.

అయితే ఉద్యోగ సాంఘిక జీవనాన్ని సమతూకం చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎస్బీఐ వినియోగదారుల కోసం అనేక ఫెసిలిటీస్ ని అభివృద్ధి చేసింది. ఎస్బీఐ యూనో యాప్ ద్వారా డిజిటల్ సేవలను విస్తృతంగా అందిస్తున్న విషయం తెలిసిందే. వినియోగదారులు ఈ – వ్యాలెట్‌ ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు అని ఎస్బీఐ ఛైర్మెన్ రజనీశ్ కుమార్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news