కేంద్రం కీలక నిర్ణయం.. మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు !

-

రైతులకు ఇచ్చినట్లు కిసాన్ క్రెడిట్ కార్డులు మత్స్యకారులకు కేసీసీ కార్డులను ఇవ్వాలని నిర్ణయించామని కేంద్ర మత్స్య శాఖ మంత్రి మురుగన్ ప్రకటించారు.  జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డులో సమీక్ష సమావేశం నిర్వహించారు కేంద్ర మంత్రి మురుగన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 70 ఏళ్ల తర్వాత మొదటిసారి మత్స్య శాఖలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించిన ప్రధానమంత్రి మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

ఆత్మ నిర్భర్ లో భాగంగా మత్సశాఖకు 20వేల కోట్ల నిధులు కేటాయించారని.. తమిళనాడులో సీ విడ్ పార్క్ ఏర్పాటు. దీని ద్వారా వేలాది మంది మహిళలకు ఉపాధి దొరకడంతో పాటు ఆర్థికంగా దోహదం చేస్తుందని తెలిపారు. విదేశాల్లో భారతదేశ సీ ఫుడ్ కు మంచి ఆదరణ ఉంది… డిమాండ్ ఉందని తెలిపారు. ఐదు ఫిషింగ్ హార్బర్ లు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని… కొచ్చిన్, చెన్నై, వైజాగ్, పార్వతీపురం మోడ్రన్ ఫిషింగ్ హార్బర్స్ డిసెంబర్ లో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. విదేశాలకు మత్స్య సంపద ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహిస్తోంది. అందుకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని… భవిష్యత్ లో డ్రోన్లు కీలక పాత్ర పోషించనున్నాయని తెలిపారు. డ్రోన్ సదుపాయంతో జాలర్లకు సహాయం చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news