కరోనాను భారత్ ఎదుర్కొంటుంది; చైనా ధీమా…!

-

కరోనా వైరస్ ని ప్రపంచానికి పరిచయం చేసింది చైనా అని ఆ దేశం కరోనా వైరస్ ని సృష్టించి ప్రపంచం మీదకు కావాలని వదిలింది అని అందరూ ఆరోపిస్తున్నారు. కరోనా వైరస్ తీవ్రత అనేది విస్తరించడానికి పెరగడానికి కారణం చైనా అనే అంటున్నారు అందరూ. ఈ నేపధ్యంలో తమ వస్తున్న ఆరోపణలను చైనా రాయబారి జీ రింగ్‌ ఖండించారు. కరోనా వైరస్‌ను చైనా తయారు చేయడంగానీ, ఉద్దేశపూర్వకంగా వ్యాపించేలా చేయలేదని ఆయన స్పష్టం చేసారు.

కరోనా వైరస్‌ను కొందరు ‘చైనీస్‌ వైరస్’, ‘వుహాన్‌ వైరస్‌’గా అనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చైనాను దోషిగా చిత్రీకరించేపనిలో భాగంగా ఉద్దేశపూర్వకంగానే కొందరు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలాంటి ఆరోపణలు చేయడంకాకుండా ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో చైనా స్పందించిన తీరుపై అంతర్జాతీయ సమాజం దృష్టిపెట్టాలని ఆయన అన్నారు. వుహాన్‌ నగరంలో కరోనా వైరస్‌ బయటపడినా…

దీని మూలాలు చైనాలోనే ఉన్నట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని ఆయన వ్యాఖ్యానించారు. సాధారణ ప్రక్రియలో భాగంగానే ఇది పుట్టిందనే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టు ఆయన వివరించారు. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి తాము అన్ని విధాలుగా భారత్ కి సహకరిస్తామని తమ దేశంలో వైరస్ ని కట్టడి చేయడానికి బారత్ సహాయం చేసిందని వివరించారు. భారత్ కరోనా ను కట్టడి చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news