చాణక్య నీతి: ఎట్టి పరిస్థితుల్లో మీ భార్యకు సంబంధించి ఈ విషయాలను ఎవ్వరికీ చెప్పకండి..!

-

చాణక్య చాలా విషయాలు గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన ఎంతో సంతోషంగా ఉండొచ్చు. చాలా ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చు. ఆర్థిక సమస్యల గురించి చాణక్య అద్భుతంగా వివరించారు. అలాగే భార్యాభర్తల మధ్య సంబంధం గురించి, స్నేహితుల గురించి, డబ్బు గురించి ఇలా అనేక విషయాల గురించి చాణక్య స్పష్టంగా చెప్పారు. చాణక్య భార్యలో ఉండే ఈ లక్షణాలు గురించి.. భార్యతో జరిగే విషయాలు గురించి కొన్నిటిని ఎవరితోనూ పంచుకోకూడదని.. వాటిని రహస్యంగా ఉంచాలని అన్నారు. భార్యాభర్తల బంధం బావుండాలంటే కచ్చితంగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అలాగే చాణక్య ప్రకారం భర్త పొరపాటున కూడా భార్య గురించి ఈ విషయాలని ఎవరితో చెప్పకూడదని చెప్పారు. దాంపత్య జీవితం బాగా సాగాలంటే దంపతులు కచ్చితంగా కొనిటిని అనుసరించాలి.

ముఖ్యంగా భార్యకి సంబంధించిన విషయాలు భర్త ఎవరితోనూ పంచుకోకూడదు. భార్య భర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి ఒక్కోసారి ఒకరిపై ఒకరికి కోపం వస్తూ ఉంటుంది. భార్యకు కూడా కోపం వస్తుంది. భార్యపై కోపం రావడానికి కారణం ఇదే అని భర్త ఈ విషయాన్ని ఎవరితో కూడా చెప్పకూడదు. అప్పుడు ఆమె నలుగురు ముందు చులకన అయిపోతారు. ఏ భర్త కూడా తన భార్య గురించి ఇతరులకి ఫిర్యాదు చేయకూడదు.

ఎప్పుడైతే అలా ఫిర్యాదు చేస్తాడో అప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి. భార్యతో సమస్య ఉన్నట్లయితే ఆమెతోనే మాట్లాడి పరిష్కరించుకోవాలి తప్ప అందరితో చెప్పకూడదు. భార్య భర్తల మధ్య సమస్యలు ఎప్పుడూ కూడా ఇతరులతో పంచుకోకూడదు. వాళ్ళ బలహీనతల గురించి కూడా ఇతరులకి చెప్పడం మంచిది కాదు. భర్త తన భార్యపై కోపాన్ని ఇంట్లో మాత్రమే చూపించాలి తప్ప నలుగురు ముందు చూపించకూడదు నలుగురు మధ్య తిట్టడం, నలుగురు మధ్య కోప్పడం మంచిది కాదు/ మర్యాదపూర్వకంగా ఉండాలి తప్ప ఇలాంటి పొరపాటు చేయకూడదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version