మాట మార్చిన చంద్రబాబు…

-

తెలుగు వారికి టెక్నాలజీని పరిచయం చేసింది తానే అంటూ గప్పాలు చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న తర్వాత మాట మార్చుతున్నారు. గతం ఎన్నికల్లో ఈవీఎంల ఆధారంగానే గెలిచిన బాబు నేడు అవే ఈవీఎంలను వ్యతిరేకించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ మధ్య జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేది మేమే అంటూ చెప్పుకుని తిరుగుతున్న ఆయన..ఈవీఎంల పనితీరుని  తప్పుబడుతున్నారు. ఈ విషయమై శ్రీకాకుళం ధర్మపోరాట సభలో పాల్గొన్న చంద్రబాబు ఈవీఎంల వినియోగంపై తీవ్ర విమర్శలు చేశారు.  ఈవీఎంల వల్ల ప్రజలు ఎవరికి ఓటు వేశారో తెలియదు, ఈవీఎంలలో వీవీప్యాట్‌లు సరిగా పనిచేయట్లేదని ఆయన అన్నారు. ఓటరు వేసే  ఓటును.. ప్రోగ్రాం తయారు చేసే వ్యక్తికి అప్పజెప్పడం సరికాదన్నారు.

దీంతో టెక్నాలజీని పక్కన పెట్టి పాత పద్ధతిలో పేపర్‌ బ్యాలెట్ విధానాన్నే అనేసరించాలని ఆయన డిమాండ్ చేశారు. బ్యాలెట్ విధానమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడా ఓటింగ్‌ యంత్రాలపై ఆధారపడట్లేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా  ‘‘ఫోన్లు, కంప్యూటర్లలో సమాచారాన్ని ట్యాపింగ్ చేసే  చట్టం తెచ్చారు. సీఎం అయిన నా ఫోన్‌ సహా అందరి ఫోన్లు, కంప్యూటర్లలో సమాచారం తీసుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైన కేంద్రంతో చంద్రబాబు దోస్తీ చెడిపోయిన తర్వాత ఎటు చూసిన ఆయనకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులే కనబడుతున్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీని ప్రోత్సహించే బాబు నేడు ఇలా మాట్లాడటాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు జీర్ణించుకోలేపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news