2017 జులై 1 న జీఎస్టీ ఇండియాలో అమల్లోకి వచ్చింది. వస్తువులన్నింటినీ జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి రకరకాల శ్లాబులను నిర్ణయించారు. 28, 18, 12, 5 శాతం శ్లాబులను కేటాయించారు. 28 శాతం శ్లాబులో ఖరీదైన వస్తువులు, ఏసీలు, ఆటోమొబైల్ వస్తువులు, నిర్మాణానికి సంబంధించిన వస్తువులు, సిమెంట్ లాంటి వాటిని పొందుపరిచారు.
100 రూపాయల వరకు సినిమా టికెట్లపై 18 శాతం ఉన్న శ్లాబు రేటును 12 శాతానికి తగ్గించింది ప్రభుత్వం. దీంతో సినిమా టికెట్ల ధరలు తగ్గనున్నాయి. దాంతో పాటు 28 శాతం శ్లాబులో ఉన్న కంప్యూటర్ మానిటర్లు, టీవీలను 18 శాతం శ్లాబులోకి మార్చారు. దీంతో కంప్యూటర్, టీవీల ధరలు తగ్గనున్నాయి.