టీడీపీకి పవన్..జనసేనకు బాబు..సపోర్ట్ తప్పదు!

-

వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లలో టి‌డి‌పి అభ్యర్ధులు గెలవాలంటే ఖచ్చితంగా పవన్ సపోర్ట్ తప్పనిసరి. అలాగే జనసేన అభ్యర్ధులు గెలవాలంటే చందబాబు సపోర్ట్ కూడా తప్పనిసరి..ఇందులో ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో టి‌డి‌పి ఒంటరిగా పోటీ చేస్తే..జనసేన వల్ల ఓట్లు చీలిపోయి కొన్ని సీట్లలో ఓటమి తప్పదని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో కూడా అదే జరిగింది.

జనసేన ఓట్లు చీల్చి వైసీపీకి లబ్ది జరిగేలా చేస్తే..టి‌డి‌పికి నష్టం జరిగింది. ఈ సారి కూడా రెండు పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తే నష్టం తప్పదు. అయితే టి‌డి‌పి ఉభయ గోదావరి జిల్లాల్లో, కృష్ణా, గుంటూరు లాంటి జిల్లాల్లో కొన్ని సీట్లలో గెలవాలంటే పవన్ మద్ధతు కావాలి. ఈ జిల్లాల్లో కొన్ని సీట్లలో జనసేన ఓట్ల చీలిక ప్రభావం ఉంది. అంటే ఆయా సీట్లలో జనసేన గెలవదు..టి‌డి‌పిని గెలవనివ్వదు అనే పరిస్తితి. చివరికి వైసీపీ గెలుస్తుంది. అంటే ఆయా సీట్లలో పవన్ సపోర్ట్ ఉంటే డౌట్ లేకుండా టి‌డి‌పి నేతలు గెలిచేస్తారు.

అదే సమయంలో జనసేన అభ్యర్ధులు గెలవాలంటే బాబు సపోర్ట్ కావాలి. ఒకవేళ జనసేన ఒంటరిగా పోటీ చేస్తే..మహా అయితే 10 లోపు సీట్లు మాత్రమే గెలుచుకోగలదనే అంచనా ఉంది. అంటే 10 సీట్లు కూడా గెలవడం కష్టమనే పరిస్తితి. ఇటీవల సర్వేల్లో కూడా అదే తేలింది. అదే టి‌డి‌పితో పొత్తు ఉంటే జనసేన పోటీ చేసే అన్నీ సీట్లలో దాదాపు గెలిచే పరిస్తితి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అంటే ఫైనల్ గా టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటేనే బెనిఫిట్ అవుతుంది…ఒకవేళ పొత్తు లేకపోతే వైసీపీ లాభం..టి‌డి‌పి, జనసేనలకు నష్టం తప్పదని తెలుస్తోంది. కాబట్టి బాబు-పవన్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version