అంత సరదాగా ఉంటే రండి.. తేల్చుకుందాం : చంద్రబాబు సవాల్

-

జగన్ ప్రభుత్వాన్ని ఎన్ని తిట్టినా చలనం లేదు.. ఎన్నికల్లో అక్రమాలు చేయడమ దేనికి..? అంత సరదాగా ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రండి.. తేల్చుకుందని సవాల్ విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబు. కేంద్రం పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గించిందని.. చాలా రాష్ట్రాలు తమ తమ పన్నులను తగ్గించాయి.. ఏపీలో ఎందుకు తగ్గించరు..? అని ప్రశ్నించారు.

చెత్త పన్ను వేస్తారా..? అందుకే ఇది చెత్త ప్రభుత్వమని మండిపడ్డారు. ఆస్తి పన్ను, నీటి పన్ను మరుగుదొడ్ల పన్ను ఇలా అన్నింటిని పెంచేశారని అగ్రహించారు. ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరపాలి.. తేడా జరిగితే నేనే ఎన్నికల సంఘం వద్దకు వెళ్తానని హెచ్చరించారు.

కోర్టులను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. అధికారులు ప్రభుత్వం చేసే అడ్డగోలు పనులకు సహకరించకూడదు.. తాము ఐఏఎస్ అధికారులమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చురకలు అంటించారు. కొంత మంది అధికారులు ప్రభుత్వం చెప్పే అడ్డగోలు పనులు చేయమని చెప్పేస్తున్నారని.. నిజాయితీగా ఉండే అధికారులకు హ్యాట్సాఫ్ అన్నారు. ప్రభుత్వం చెప్పే తప్పుడు పనులు చేసి అధికారులు కూడా కోర్టులు చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకోవద్దని.. చిన్నపాటి విమర్శలు వచ్చినా రాజీనామాలు చేసిన ఘటనలు ఉన్నాయన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news