పోలవరం సాక్షిగా బయటపడిన చంద్రబాబు కథ !!

-

చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జీవనాడి ప్రాజెక్ట్ పోలవరం విషయంలో తెలుగుదేశం పార్టీ తెగ గొప్పలు చెప్పుకుంది. ప్రతి సోమవారం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న అదిగో రాసి పెట్టుకో ఇదిగో రాసి పెట్టుకో అప్పటికల్లా పూర్తి చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా టిడిపి ఇరిగేషన్ శాఖ మంత్రి టైం చెప్పి మరీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని విమర్శలు చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ఎన్నికలలో ఏపీ ప్రజలు తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం జరిగింది.

Image result for polavarm chandrababu

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి పోలవరం పనుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద పెట్టింది. పోలవరం సాక్షిగా చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి మొత్తం తాజాగా బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే చంద్రబాబు హయాంలో  కాఫ‌ర్ డ్యామ్ ప‌నులు చేసేసి,మొత్తం అయిపోయింద‌ని ప్ర‌జ‌ల‌ను భ్ర‌మింప‌జేసే ప్ర‌య‌త్నం జరిగింది. దీనివల్ల పక్కనున్న ఒడిశా రాష్ట్రం తాజాగా పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఒడిషా ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు స్వీకరించింది.

 

దీంతో విచారణ నిమిత్తం ఏ క్షణాన్నైనా పోలవరం ప్రాజెక్టు పనులను ఆపివేయాలని ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని నష్టం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఏదైనా భారీ ప్రాజెక్ట్ చేపడుతున్న అప్పుడు నిర్వాసితులకు ఆ ప్రాజెక్టు వల్ల భూములను ఇల్లు కోల్పోయిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే బాబు సర్కార్ ఇవన్నీ పట్టించుకోకుండా నిర్మాణ పనులు చాలా అన్నట్టుగా వ్యవహరించడంతో కాంట్రాక్టర్లు కమిషన్లు దండిగా దండు కోవడమే అన్నట్టుగా వ్యవహరించడంతో గత ఏడాది భారీగా వర్షాలు పడటం తో పోలవరం నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిలో ఒరిస్సా ప్రభుత్వానికి చెందిన ప్రజలు కూడా ఉండటంతో…తాజాగా ఈ సమస్య ఏర్పడింది. అక్కడి ప్రభుత్వం ఇప్పుడు సుప్రీం ని ఆశ్రయించింది. దీంతో ఏ క్షణాన్నైనా సుప్రీంకోర్టు పోలవరం ప్రాజెక్టు పనులను ఆపేసే చాన్స్ ఉంది. 

Read more RELATED
Recommended to you

Latest news