ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనలో ప్రజలు కొంతమేరకు సంతోషంగానే ఉన్నారని చెప్పాలి. ఇక ప్రజలను ఆర్ధికంగా బలపరిచే చాలా స్కీం లను జగన్ ప్రవేశ పెడుతూ వారి మెప్పును పొందుతున్నారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇంటింటికీ జగన్ అన్న కార్యక్రమంలో స్థానిక నేతలు వెళ్లి ప్రతి ఒక్కరినీ కలిసి తమ పాలన ఎలా ఉందని అడిగారు. ఈ కార్యక్రమం చాలా సక్సెస్ అయినట్లుగా వైసీపీ పేర్కొంది. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రతిపక్ష టీడీపీ సైతం ఇదే విధానాన్ని అమలు చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. రేపటి నుండి రాష్ట్రము అంతటా బాబు స్యురిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో లోకల్ లీడర్స్ ప్రతి ఇంటికి వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. టీడీపీ ప్రజల కోసం తీసుకురానున్న పధకాలు మరియు ఉద్దేశ్యాలు గురించి వివరించనున్నారు. ఇక దీనితో టీడీపీ పై ట్రోలింగ్ మొదలైంది.
జగన్ ప్లాన్ ను చంద్రబాబు కాపీ కొడుతున్నారు అంటూ అంటున్నారు. మరి ఇది ఏ మేరకు సక్సెస్ కానుందో తెలియాల్సి ఉంది.