ఈ రోజు మరియు రేపు ముంబై లో విపక్షాల కూటమి జరగనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ రోజు సమావేశం జోరుగా సాగుతోంది… ఈ సమావేశంలో విపక్ష నేతలలో ఒక్కొక్కరూ మాట్లాడుతూ దేశంలోకి ప్రజాస్వామ్యాన్ని మరియు రాజ్యాంగాన్ని కాపాడడానికి మేము అంతా ఒక్కటిగా మారమని తెలియచేశారు. ఈ కూటమి ఏర్పడిన తర్వాత మూడవ సారి వీరంతా ఏకమవ్వడం విశేషం. కాగా ఈ సమావేశానికి మొత్తం పార్టీలకు చెందిన ముఖ్యమైన నాయకులు అంతా హాజరయ్యారు. ఇప్పటి వరకు జరిగిన ప్రకారం చూస్తే … కేవలం సాధారణ చర్చలు మాత్రమే జరిగినట్లుగా సమాచారం అందుతోంది. రేపు కీలక విషయాలపైనే చర్చ జరగనుంది.. అందులో కూటమే యొక్క లోగో ను ఎంపిక చేయనున్నారు, కో ఆర్డినేషన్ కమిటీ మరియు ఇతర సభ్యులను ఏర్పాటు చేయనున్నారు.
ఇక బీజేపీ ని ఎదుర్కోవడానికి సరైన ప్రణాళిక మరియు వారి బలాలు మరియు బలహీనతలు గురించి రాష్ట్రాల వారీగా చర్చించి.. ఇక అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నందున అభ్యర్థుల ఎంపిక గురించి కూడా చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.