ఏపీలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఊహించని షాక్ తగిలింది. చంద్రబాబు గో బ్యాక్ అంటూ పీలేరులో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిసాయి. మతకలహాలు సృష్టిస్తున్న సైకో చంద్రబాబు గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ‘గో బ్యాక్ చంద్రబాబు, పుంగనూరులో మతకలహాలు సృష్టిస్తున్న చంద్రబాబు గో బ్యాక్, సైకో చంద్రబాబు గో బ్యాక్’ అని కొందరు బాబు రాకను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలతో నిరసించారు.
వైయస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ గుండాలు దాడులు చేస్తే ఊరుకోవాలా అని ప్రశ్నిస్తూ గాయపడిన వారి ఫోటోలను ఫ్లెక్సీలో ఉంచారు. కాగా, పీలేరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పుంగనూరు టిడిపి కార్యకర్తలను పరామర్శించడానికి సోమవారం చంద్రబాబు వెళ్లారు. మూలాఖత్ కు బాబుతో పాటు ఆరుగురు అధికారులకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో సైకో చంద్రబాబుగో బ్యాక్ అంటూ పీలేరు రైల్వే ట్రాక్ వద్ద ప్లెక్సీలు కనిపించాయి.