చంద్రబాబు లాయర్ లూథ్రా మరో ఇంటరెస్టింగ్ ట్వీట్…

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ రోజు చాలా బాధకు గురి చేసే విషయం అని చెప్పాలి. ఎందుకంటే హై కోర్ట్ లో చంద్రబాబు తరపున వేసిన క్వాష్ పిటీషన్ ను కొట్టి వేస్తూ హై కోర్ట్ తీర్పును జారీ చేసింది… ఈ విషయం గురించి ఆలోచిస్తుండగానే, ఏసీబీ కస్టడీ కి ఇస్తూ ఉత్తర్వులు రావడంతో ఒకే రోజు రెండు షాక్ లు తిన్నాడు చంద్రబాబు. కాగా చంద్రబాబు కేసును వాదిస్తున్న ఉద్దండ లాయర్లు లూథ్రా మరియు హరీష్ సాల్వే లు ఎంత వాదించినా హై కోర్ట్ న్యాయమూర్తులను కన్విన్స్ చేయలేక ఈ కేసులో ఫెయిల్ అయ్యారు. ఇక తాజాగా మరోసారి లూథ్రా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.. ఈయన ట్వీట్ లో ” ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది. ప్రతి ఉదయం మన జీవితాలలో వెలుగును ఇస్తుంది” అని అర్ధం వచ్చేలా మెసేజ్ చేశాడు.

 

ఇక కొన్ని రోజుల క్రితం “న్యాయం తనకు దక్కదేమో అని తెలిసినప్పుడు.. కత్తి తీసి పోరాటం చేయడమే సరైన మార్గం” అంటూ ట్వీట్ చేసి చర్చలకు కారణం అయ్యాడు. దీనిపైన కొందరు కేసులు కూడా పెట్టడం గమనార్హం. కాగా తర్వాత చంద్రబాబు లాయర్లు ఎటువంటి స్టెప్ తీసుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది.