సిఐడి పోలీసులు మాజీ సీఎం చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధులు తారుమారు అయ్యాయని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోర్ట్ లో హాజరు పరిచి వాదప్రతివాదనలు జరుగగా ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ ను విధించాలని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక తాజాగా చంద్రబాబు తరపున లాయర్లు వయసు మరియు ఇతర భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఆయన్ను హౌస్ అరెస్ట్ కు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేయగా దానిని తిరస్కరించారు. అందుకే ఇప్పుడు లూథ్రా అండ్ టీం ఒక కీలక స్టెప్ వేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు పేపర్స్ లో అసలు ఏముందో తెలుసుకోవాలని కోర్ట్ ను పేపర్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసుకోవడంతో, అందుకు కోర్ట్ సమ్మతించింది.
త్వరలోనే ఈ కేసు పేపర్ లను లూథ్రా అండ్ టీం చూసే అవకాశం ఉంది. ఆ తర్వాత అయినా చంద్రబాబును బయటకు తీసుకురావడానికి ఏమైనా మార్గం కనిపిస్తుందా చూడాలి.