సీఈసీతో చంద్రబాబు భేటీ.. ఏపీలో దొంగ ఓట్లపై ఫిర్యాదు

-

సీఈసీతో టీడీపీ చీప్ చంద్రబాబు నాయుడు  బృందం  తాజాగా భేటీ అయింది. ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై  సీఈసీకి  టీడీపీ బృందం  ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో  టీడీపీ సానుభూతిపరుల ఓట్లను  వైసీపీ తొలగిస్తుందని  టీడీపీ ఆరోపిస్తుంది. అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో  ఓట్ల తొలగింపు అంశానికి సంబంధించి  ఇప్పటికే  స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్  ఈసీకి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా  ఈసీ అధికారులు  విచారణ నిర్వహించాలని స్థానికంగా  ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ విషయమై  జిల్లా పరిషత్ సీఈఓలుగా పనిచేసిన ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.  

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అతి ముఖ్యమైన సమస్య ప్రజాస్వామాన్ని కాపాడుకునే ప్రక్రియలో తాను ఇక్కడికి వచ్చాను అని తెలిపారు.  వింత సమస్య.. విచిత్రమైన సమస్య. ఒక పార్టీ ఓట్లను తీసేసే ఆలోచన చరిత్రలో ఇప్పటివరకు రాలేదు. ఇప్పటికే చాలా సార్లు పోరాడాం. ఈ ప్రభుత్వం వచ్చిన నాలుగున్నర సంవత్సరాలు చూసినట్టయితే .. పార్లమెంట్ బై ఎలక్షన్ లో బోగస్ ఎఫిక్ కార్డులు ప్రింట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోలేదు. దీనిపై కోర్టుకు వెళ్లాం. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం ఏకగ్రీవం చేసుకున్నారు. టీడీపీ ఓట్లు ఉన్న చోట ఓట్లను తొలగిస్తుంది వైసీపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. 

Read more RELATED
Recommended to you

Latest news