పాకిస్తాన్ లెజెండ్ బౌలర్ వసీం అక్రమ్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఆసియా కప్ మరియు ఇంకో రెండు నెలల్లో జరగనున్న వన్ డే వరల్డ్ కప్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈయన ఒక స్పోర్ట్స్ ఛానెల్ తో మాట్లాడుతూ… ఆసియా కప్ లో ఇండియా, పాకిస్తాన్ మరియు శ్రీలంక లు ప్రమాదకర జట్లు అంటూ అభిప్రాయపడ్డాడు. ఈ మూడు జట్లు తమదైన రోజున ఎటువంటి జట్టును అయినా ఓడించగల సామర్ధ్యం ఉందని అక్రమ్ చెప్పారు. ఇంకా అక్రమ్ మాట్లాడుతూ ఈ మధ్యన ఆటగాళ్లు అంతా కూడా ఎక్కువగా టీ 20 ఫార్మాట్ లు ఆడడానికి బాగా అలవాటు పడ్డారు. ఇక వన్ డే లలో ఒక్కో బౌలర్ 10 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉండగా , నాలుగు ఓవర్లు వేయడం అలవాటు కావడంతో ఏ విధంగా ఆసియా కప్ లో బౌలింగ్ చేస్తారు అన్నది చూడాలంటూ అక్రమ్ తన సందేహాన్ని వెలిబుచ్చాడు.
ఇక వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని ఆసియా కప్ ను కూడా ఓవర్లకు మార్చడం చాలా శుభపరిణామం అంటూ ఐసీసీ ని కొనియాడారు.