ట్విట్టర్ వేదికగా వాజ్ పేయి కి నివాళులర్పించిన చంద్రబాబు

-

నేడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా టిడిపి అధినేత నారా చంద్రబాబు ట్విట్టర్ వేదికగా నివాళి అర్పించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేళ తప్పక తలచుకోవలసిన దేశభక్తుడు వాజ్ పేయి అని పేర్కొన్నారు చంద్రబాబు. దేశ గమనాన్ని మార్చిన గొప్ప నేత వాజ్ పేయి అని కొనియాడారు. ఆధునిక భారత్ నిర్మాణంలో అటల్జీ కీలకపాత్ర పోషించారని అన్నారు.

వాజ్పేయి పాలనా కాలంలో ఊపిరి పోసుకున్న స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్, టెలికాం, సూక్ష్మ సేద్యం, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్, ఓపెన్ స్కై పాలసీ, కోర్టుల వంటి కీలక సంస్కరణల్లో ఆయనతో కలిసి పనిచేయడం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. దేశంలోనే అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వాజ్పేయి పాలనలో అభివృద్ధి చేసినవేనని అన్నారు. ప్రధానిగా ఉన్న సమయంలో పోక్రాన్ అను పరీక్షలు, కార్గిల్ విజయం వంటివి భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version