నేడు రాజధానిలో బంద్‌కు రైతుల పిలుపు.. 144 సెక్షన్ అమలు

-

ఏపీ రాజధాని మూడు ప్రాంతాల్లో ఉంటుందన్న ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో రైతులు బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు ఇస్తుండటంతో ఆయా గ్రామాల్లో జనజీవనం స్తంభించింది. కొన్ని చోట్ల రోడ్లకు అడ్డంగా వాహనాలను పెట్టి రైతులు ఆందోళన చేస్తున్నారు. దాంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మ‌రోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పోలీసులు 144, 34 సెక్షన్ విధించారు. ఈ మేరకు తుళ్లూరు డీఎస్పీ తెలిపారు. రైతులు తమ ఆందోళనను శాంతియుతంగా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్వహించాలని కోరారు.

చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. కాగా, బంద్ నేపథ్యంలో పాఠశాలలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు మూతపడనున్నాయి. తమ ఆందోళనల్లో భాగంగా రైతులు, కూలీలు వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలను ప్రారంభించనున్నారు. అలాగే, 29 గ్రామాల్లోని ఆయా గ్రామ సచివాలయాల వద్ద కూడా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news