సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం: ఎన్టీఆర్ కు ఆహ్వానం!

-

ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా ఈ నెల12న చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ముమ్మరంగా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సినీ దిగ్గజాలకు ఆహ్వానం అందింది. మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్తో పాటు మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ను ఆహ్వానించినట్లు ఇండియా టుడే తెలిపింది. అయితే, తమ్ముడి ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు చిరంజీవి ఇప్పటికే హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరారు. వీరితోపాటు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు.

కాగా, కూటమి దెబ్బకు వైసిపి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఎన్డీఏ కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 175 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది

Read more RELATED
Recommended to you

Latest news