ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్

-

ఏపీకి నాలుగో సారి సీఎంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తనదైన శైలీలో యాక్షన్ మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు.సీఎం హోదాలో ఇవాళ ఫస్ట్ టైమ్ సెక్రటేరియట్‌కు వెళ్లిన చంద్రబాబు.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని ఐదేళ్లలో కొందరు అధికారుల తీరు నన్ను తీవ్రంగా బాధించిందని, ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు ఇలా వ్యవహరిస్తారని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ఇకనైనా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఆత్మ సమీక్ష చేసుకోవాలని చంద్రబాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

మరోసారి శాఖల వారీగా అందరితో సమావేశమవుతానని ఆయన తెలిపారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు వైసీపీ తొత్తుల్లా వ్యవహరించి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలను తీవ్ర ఇబ్బందులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ అండ చూసుకుని రెచ్చిపోయిన అధికారులపై చంద్రబాబు యాక్షన్ తీసుకుంటారా..? ఒక వేళ తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news