సోనాక్షి సిన్హా మరియు జహీర్ ఇక్బాల్ పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా మీడియా మరియు సోషల్ మీడియాలో భారీగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోనాక్షి సిన్హా- జహీర్ ఇక్బాల్‌ల వివాహం గురించి ఎంతగా చర్చించినప్పటికీ.. అటు సోనాక్షి సిన్హా కానీ.. ఇటు జహీర్ ఇక్బాల్ వైపు నుంచి కానీ ఎలాంటి స్పందించడం లేదు.
తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన పెళ్లి జరిగే తేదీని కన్మర్మ్ చేసింది. ఈ విషయాన్ని INDIA TODAY తెలిపింది. ఈనెల 23న ముంబైలోని బాస్టియన్ లో రాత్రి 8 గంటలకు జహీర్ ఇక్బాల్ ను సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకోనున్నట్టు పేర్కొంది. వెడ్డింగ్ ఇన్విటేషన్ వినూతనంగా మ్యాగజైన్ కవర్ పేజి తరహాలో ఉందని వెల్లడించింది. ఇటీవల సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్ కి సంబంధించిన వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో కనిపించగా.. దీనిపై ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా స్పందించి.. సోనాక్షి పెళ్లి గురించి తనకు ఇంకా చెప్పలేదని పేర్కొనడం గమనార్హం. మొత్తానికి ఈనెల 23న సోనాక్షి పెళ్లి జరుగుతుందన్నమాట.