అదేంటి జగన్ తో చంద్రబాబు భేటీ కావడం అని అందరికీ అనుమానాలు కలగచ్చు, కానీ వాళ్ళు కలుస్తున్నారు కానీ అది ఇద్దరు మాత్రమే కాదు, తమ తమ పార్టీల నేతలతో కలిసి. విషయానికి వస్తే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్, సభ్యుల ఎంపికపై ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన 11 గంటలకు సచివాలయంలో కమిటీ సమావేశం కానున్నట్లు చెబుతున్నారు.
కమిటీ సభ్యులుగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, శాసన మండలి చైర్మన్ షరీఫ్, శాసనసభ స్పీకర్ తమ్మినేని, హోంమంత్రి సుచరిత, శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఉండడంతో ఈ సమావేశానికి వీరు కూడా హాజరు కావాల్సి ఉంది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ , సభ్యుల ఎంపిక కోసం కమిటీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా సీఎస్ కార్యాలయం ప్రతిపక్షానికి చెందిన నేతలకు సమాచారం పంపినట్టు తెలుస్తోంది. అయితే జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు జగన్ తో జరగనున్న సమావేశానికి హాజరు అవుతారో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.