ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా వేగవంతంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద గ్రామీణ ప్రాంతాల్లో చాలా వేగంగా రోడ్లను వేస్తున్నారు.మౌలిక సదుపాయాల మీద మేజర్‌గా ఫోకస్ చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మహిళా సాధికారత కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
ఏపీలో టూరిజం డెవలప్మెంట్ కోసం సైతం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీ శైలానికి సీ ప్లేన్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.శనివారం సీ ప్లేన్‌ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీంతో టూరిజంతో పాటు శ్రీశైలం టెంపుల్ ఆదాయం కూడా
గణనీయంగా అభివృద్ధే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.