హరీష్ రావు బీజేపీలో చేరికపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చిట్ చాట్ లో మాట్లాడుతూ… బీఆర్ఎస్ లో హరీష్ రావు మాత్రమే క్రెడిబిలిటీ కలిగిన నాయకుడు అన్నారు. హరీష్ రావు బీజేపీలోకి వస్తానంటే..పార్టీలో అంత కలిసి నిర్ణయం తీసుకోవాలి.. నా ఒక్కడి నిర్ణయం కాదని వెల్లడించారు.
కేటీఆర్ కళ్ళు నెత్తికెక్కాయని ఆగ్రహించారు. కేటీఆర్ కు అహంకారం ఎక్కువ అన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బు వల్లే అహంకారం పెరిగిందని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
తెలంగాణలో త్వరగా ఎదుగుతున్న కాషాయ పార్టీపై కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయని.. ఆ పార్టీ నేతల మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. సీఎం రేవంత్, కేటీఆర్ చెరో టాపిక్ ఎంచుకుని రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటకెక్కాయని దుయ్యబట్టారు బండి సంజయ్.