నెల్లూరు బాలికపై యాసిడ్ దాడి..చంద్రబాబు సీరియస్ అయ్యారు. నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 14 ఏళ్ల బాలికపై ఒక దుర్మార్గుడు అత్యాచారానికి ప్రయత్నించి… ఆమె ప్రతిఘటించటంతో నోట్లోను, ముఖం మీద యాసిడ్ పోసి.. ఆపై గొంతు కోసి పరారైన దారుణ ఘటన దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు.
ఇంట్లో ఉన్నప్పటికీ ఏపీలో ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేదని ఇంకోసారి రుజువైంది. అత్యాచార ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు అమలుచేస్తే ఇటువంటి నేరాలు పునరావృతం కావు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీలో నేరాల రేటు పెరిగిందని జాతీయ గణాంకాలు మొన్ననే చెప్పాయి. ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ నేరాల నియంత్రణకు చిత్తశుద్ధితో పనిచేయక పోవడంతో నేరగాళ్ళ విచ్చలవిడితనం పెరిగిపోయిందని ఫైర్ అయ్యారు.
నేరం చేసిన వైసీపీ రౌడీలను వెనకేసుకు రావడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరి పైనా అక్రమకేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ శాంతి భద్రతలు కాపాడటంలో ఎందుకు లేదు? బాలికపై ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాలికకు మెరుగైన వైద్యం అందించాలి. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలన్నారు చంద్రబాబు.
నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 14 ఏళ్ల బాలికపై ఒక దుర్మార్గుడు అత్యాచారానికి ప్రయత్నించి. ఆమె ప్రతిఘటించటంతో నోట్లోను, ముఖం మీద యాసిడ్ పోసి.. ఆపై గొంతు కోసి పరారైన దారుణ ఘటన దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/4) pic.twitter.com/8NAvUrPf5X
— N Chandrababu Naidu (@ncbn) September 6, 2022