చైనాలో భారీ భూకంపం సంభవించింది. దాదాపు 46 మంది మృత్యువాత పడ్డారు. రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. దీంతో పలు చోట్లా భవనాలు కూలిపోయాయి. ఆయా చోట్లల్లో చిక్కుకున్న 50వేల మందికిపైగా ప్రజలను సురక్షితంగా తరలించారు. ఈ మేరకు సిచువాన్ ప్రావిన్స్ లో సహాయక చర్యలకు చైనా ప్రభుత్వం 6,500 రెస్క్యూ టీమ్, నాలుగు హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది. సహాయక చర్యలు కొనసాగించింది.
వీటితోపాటు 1,100 అగ్నిమాపక దళాలను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో చైనా ప్రభుత్వం 50 మిలియన్ యువాన్ల రిలీఫ్ ఫండ్‌ను విడుదల చేసింది. అలాగే ప్రాంతీయ ప్రభుత్వం కూడా గంజికి 50 మిలియన్ యువాన్లు ప్రకటించింది. భూకంప కేంద్రంగా ఉన్న లూడింగ్ కౌంటీకి నిత్యావసరాలు సరఫరా చేసింది. కాగా, 2008లో చైనాలో 8.2 తీవ్రతతో భూకంపం రాగా.. 69వేల మంది ప్రాణాలు కోల్పోయారు.