చేతకాకపోతే తప్పు కోండి : జగన్ కు చంద్రబాబు వార్నింగ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సిఎం జగన్ పై మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. అసలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా ? అని నిలదీశారు. ఎన్నిక నిర్వహించడం చేతగాకపోతే తప్పుకోండని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. విధ్వంసం సృష్టించి ఎన్నిక వాయిదా వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఫైర్ అయ్యారు. ఎన్నిక నిర్వహించడం చేతగాకపోతే ఎస్ఈసి, డీజిపి పదవులనుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

ఎన్నిక ను అడ్డుకునే బదులు అధికార పార్టీ వారిని చైర్మన్ గా నియమించుకోండి ? అని ఫైర్ అయ్యారు. భయ భ్రాంతులకు గురిచేసి టిడిపి సభ్యులను లోబర్చుకోవాలని చూస్తున్నారని తెలిపారు. మారణా యుధాలతో సంబంధం లేని వ్యక్తులు హల్ చల్ చేస్తున్నా పోలీసులు గుడ్లప్పగించి చూస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. ఎంపి నానితో సహా టిడిపి సభ్యులు క్రమశిక్షణ, ఓర్పుతో వ్యవహరిస్తున్నారని.. మా సహనాన్ని చేతగానితనంగా పరిగణించొద్దని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. కొండపల్లి చైర్మన్ ఎన్నిక నిర్వహించి ప్రజాస్వామ్య విలువలను కాపాడండని కోరారు చంద్రబాబు.