కుప్పం రివ్యూలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర స్థాయిలో పార్టీలో కోవర్టులు తయారయ్యారని… పార్టీలోని కోవర్టులను ఏరిపారేస్తానని హెచ్చరించారు చంద్రబాబు. కుప్పం నుంచే పార్టీ ప్రక్షాళన ప్రారంభిస్తానని…నన్ను మెప్పించడం కాదు.. ప్రజల్లో పనిచేసిన వారికే గుర్తింపు ఇస్తానని తెలిపారు. స్థానిక నేతల అతి విస్వాసం వల్లనే కుప్పంలో ఓటమి పాలయ్యామని ఆయన తెలిపారు.
కుప్పం స్థానిక నాయకత్వంలో మార్పులు చెయ్యాలన్న కార్యకర్తల సూచనలు అమల్లోకి తెస్తానని తెలిపారు చంద్రబాబు. ఇకపై తరుచూ కుప్పంలో పర్యటిస్తానని.. కార్యకర్తలకు, నేతలు ఎక్కవ సమయం ఇస్తానని పేర్కొన్నారు. కుప్పంలో ఇల్లు నిర్మించుకుని ఎక్కవ సమయం ఇవ్వాలన్న కార్యకర్తల సూచనలకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
చంద్రబాబు గత పర్యటనల్లో గెస్ట్ హౌసులో కరెంట్ తీసెయ్యడం, బస్సులో బస చెయ్యాల్సి రావడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు. కాగా..కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో… తెలుగు దేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడి పోయిన సంగతి తెలిసిందే.