ఈరోజు కొడాలి నాని ఇలాఖాలోకి రోడ్ షో నిర్వహించారు చంద్రబాబు. బందరులో ఇదేం ఖర్మ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బటన్ నొక్కి జగన్ 2 లక్షల కోట్లు బొక్కేశారన్నారు. పులివెందులలో బస్టాండ్ కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడా అని ప్రశ్నించారు. అటు పేర్నినాని, వల్లభనేని వంశీపై హేళన చేశారు. జగన్ దేశంలోనే నెంబర్ వన్ ధనిక సీఎం అని డేటా వచ్చిందని,ఈయన పేదల ప్రతినిధి ఎలా అవుతారని అన్నారు బాబు. రాష్ట్రాన్ని దోచుకుంటూ ఆయన ధనికుడు అవుతున్నారన్నారు. జగన్ కొత్తగా స్టిక్కర్లు వేస్తున్నారని.. ఆయన నమ్మకం కాదు శాపం అంటూ మండిపడ్డారు. వైనాట్ కుప్పం కాదు.. పులివెందులలో గెలిచి చూపించామన్నారు చంద్రబాబు. పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలు సత్తా చూపించారని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామన్నారు బాబు.
అయితే, గుడివాడలో కొడాలి నాని కార్యాలయం వద్ద ఈ సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది.
కొడాలి నాని కార్యాలయం వద్దకు వైసీపీ, టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఇరు పార్టీల వర్గీయులు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేస్తుండడంతో పరిస్థితి ఎటు దారితీస్తుందోనన్న హడావిడి కనిపించింది.
ఈ సందర్భం లో, పోలీసు బలగాలను పెద్ద సంఖ్యలో గుడివాడకు తరలించారు. ఎవరూ కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులు పోలీసులను బృందాలుగా విభజించి రూట్లు నిర్దేశిస్తున్నారు.