“చంద్రముఖి – 2 ” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ … !

-

గతంలో వాసు దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇందులో రజిని, జ్యోతిక నటనకు దేశ ప్రజలు అంతా ఫిదా అయ్యారు. అయితే ప్రేక్షకుల కోరిక మేరకు ఈ సినిమాకు సీక్వెల్ ను తీయాలని ఎప్పటి నుండో అనుకుంటూ ఉండగా, ఇన్నాళ్లకు కుదిరింది.. అయితే చంద్రముఖి 2 లో రజినీకాంత్ నటించడం లేదు. ఇందులో హీరోగా డైరెక్టర్ రాఘవ లారెన్స్ నటిస్తున్నాడు.. కంగనా రనౌత్ హీరోయిన్ గా చేయనుంది. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్, టీజర్ లతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కాగా ఇందులో నుండి ఫస్ట్ సింగిల్ ను కాసేపటి క్రితమే విడుదల చేసింది చిత్ర బృందం.. స్వాగతాంజలి అంటూ సాగే ఈ పాటలో కంగనా రనౌత్ లుక్ మరియు డ్యాన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాను రానున్న వినాయకచవితి పండుగకు విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news