భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కార్యక్రమం.. చంద్రయాన్-2.. అనుకోని సాంకేతిక సమస్యల వల్ల ఆగిపోయింది. త్వరలోనే అన్ని సమస్యలను సరి చేసి మరోసారి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఇస్రో సైంటిస్టులు తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కార్యక్రమం.. చంద్రయాన్-2.. ఈ రోజు తెల్లవారు జామున 2.51 గంటలకు చంద్రయాన్-2ను ప్రయోగించాల్సి ఉంది. అందుకనే 24 గంటల ముందుగానే కౌంట్ డౌన్ కూడా ప్రారంభించారు. అయితే అనుకోని సాంకేతిక సమస్యల వల్ల చంద్రయాన్-2ను నిలిపివేశారు. దీంతో చంద్రయాన్-2 కార్యక్రమం వాయిదా పడింది.
చంద్రయాన్-2ను తీసుకెళ్లనున్న జీఎస్‌ఎల్‌వీ ఎంకే 3 రాకెట్‌లో మూడో దశలో సాంకేతిక సమస్య వచ్చినందునే చంద్రయాన్-2ను నిలిపివేశామని ఇస్రో సైంటిస్టులు తెలిపారు. కాగా చంద్రయాన్-2 ప్రయోగానికి 56.24 నిమిషాలు ఉందనగా కౌంట్ డౌన్ ఆగిపోయింది. రాకెట్‌లో అత్యంత కీలక దశగా ఉన్న మూడో దశలో క్రయోజెనిక్ ఇంజిన్‌కు సంబంధించిన బ్యాటరీలు చార్జ్ కాకపోవడం, గ్యాస్ బాటిల్ లీకేజీ అవడం.. తదితర కారణాల వల్ల చంద్రయాన్-2ను ఆపేశారు. అయితే ఈ లోపం అంత అకస్మాత్తుగా ఎందుకు వచ్చిందో సైంటిస్టులు తేల్చే పనిలో పడ్డారు.
ఇక చంద్రయాన్-2 ఆగిపోయినందున త్వరలోనే అన్ని సమస్యలను సరి చేసి మరోసారి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఇస్రో సైంటిస్టులు తెలిపారు. అయితే దీన్ని సెప్టెంబర్ 9వ తేదీన నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అప్పటికి అన్ని సమస్యలు తొలగితే చంద్రయాన్-2ను సైంటిస్టులు విజయవంతంగా ప్రయోగిస్తారు. మరి ఈసారి ఈ కార్యక్రమం సాఫీగా సాగుతుందా, లేదా చూడాలి..!