తెలంగాణ ఎంసెట్ ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఫలితాలకు సంబంధించిన షెడ్యూల్‌లో అధికారులు స్వల్ప మార్పులు చేసినట్లుగా తాజాగా తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ అగ్రికల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఉదయం 9.30 గంటలకు ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారని తెలిపారు. అయితే అనుకున్న సమయం కంటే కాస్తే ముందుగా విడుదల చేయనున్నట్లుగా సమాచారం.
మాసాబ్ ట్యాంక్ సమీపంలోగల జవహర్ లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ లో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారని కన్వీనర్ పేర్కొన్నారు .ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా , ఉన్నత విద్య కార్యదర్శి వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, జేఎన్‌టీయూ- హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి , ప్రొఫెసర్ వి .వెంకట రమణ వైస్ చైర్మన్ ,డాక్టర్ ఎన్ .శ్రీనివాస్ రావు కార్యదర్శి టి ఎస్ సి హెచ్ ఈ తదితరుల అధికారుల సమక్షంలో విడుదల చేయనున్నట్టు కన్వీనర్ తెలిపారు.