దేశంలో నిరుద్యోగ రేటు రోజు రోజుకు పెరిగి పోతుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు తెలంగాణలోని నిరుద్యోగం కనిపిస్తుంది.. కానీ దేశంలో ఉన్న నిరుద్యోగం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నిరుద్యోగం రాష్ట్రంలో ఎక్కువ ఉందా.. లేదా దేశంలో ఎక్కువ ఉందా.. అని ప్రశ్నించారు. 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అని మోడీ హామీ ఇవ్వాలేదా.. అని అన్నారు. కేంద్రంలో ఖాళీ గా ఉన్న 15.62 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి వేల సంఖ్యలో ఉద్యోగాలను రోడ్డు పాలు చేశారని ఆగ్రహించారు. దేశంలో నిరుద్యోగానికి, జీడీపీ పడిపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. కాగ తెలంగాణలో ఇప్పటి వరకు 1,32,899 ఉద్యోగాలను ఇచ్చామని అన్నారు. అలాగే మరో 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కానీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చాలా పథకాలను కేంద్ర మంత్రులు ప్రశంచ లేదా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు.