ఈటల ఆగారా? ఆపారా?

-

ఈటల రాజేందర్ సైలెంట్ అయ్యారా? లేక ఎవరైనా సైలెంట్ చేశారా? అసలు ఈటల రాష్ట్ర స్థాయిలో ఈ మధ్య కనబడటం తగ్గించారు? అంటే దానికి కారణాలు మాత్రం తెలియడం లేదు గాని…ఈ మధ్య ఈటల దూకుడు మాత్రం తగ్గిందనే చెప్పాలి. అసలు తెలంగాణలో కేసీఆర్‌తో ధీటుగా ఉండే నాయకుడు ఈటల రాజేందర్. మరి అలాంటి నేత దూకుడు ఎందుకు తగ్గించారనేది అర్ధం కాని విషయం.
అసలు ఈటల ఎప్పుడైతే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ని ఓడించారో…అప్పటినుంచి ఈటల బీజేపీలో కీలకం కాబోతున్నారని ప్రచారం వచ్చింది. బీజేపీలో సీఎం అభ్యర్ధి ఈటల అని కథనాలు వచ్చాయి. ఈటలతో పోలిస్తే బీజేపీలో పెద్ద ప్రజాకర్షణ నేతలు లేరు. దీంతో బీజేపీలో ఈటల సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవుతారని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈటల దూకుడుగానే రాజకీయం మొదలుపెట్టారు. కేసీఆర్ ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు.
మరి అలాంటిది ఈ మధ్య ఈటల దూకుడు కాస్త తగ్గినట్లు కనిపించింది. ఎప్పుడైతే వరి విషయంలో రచ్చ మొదలైందో అప్పటినుంచి ఈటల హవా తగ్గింది. అప్పుడు సీఎం కేసీఆర్ డైరక్ట్‌గా బండి సంజయ్‌ని టార్గెట్ చేయడం…సంజయ్ సైతం దూకుడుగా రాజకీయం చేయడం…టీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా బండిపైనే ఫోకస్ చేయడంతో..ఈటల దూకుడు తగ్గినట్లు కనిపిస్తోంది. ఏదో నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తప్ప..రాజకీయంగా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటాలు చేసే విషయాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఇప్పుడు టోటల్‌గా బండి సంజయ్ టార్గెట్‌గానే టీఆర్ఎస్ రాజకీయాలు ఉన్నాయి.
అంటే ఇక్కడ కేసీఆర్ తెలివిగా ఈటల హవాని తగ్గించడం కోసం బండిని టార్గెట్ చేశారా? అనే డౌట్ కూడా వస్తుంది. ఒకవేళ ఈటలని డైరక్ట్ టార్గెట్ చేస్తే పరిస్తితులు వేరుగా ఉండేవి ఏమో..ఇక్కడ ఈటల కూడా అంత దూకుడుగా కూడా రాజకీయం చేస్తున్నట్లు కనిపించడం లేదు. మొత్తానికి ఈటలకు కేసీఆర్ పరోక్షంగా బ్రేకులు వేసినట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news