అలర్ట్ : తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో తేదీల్లో మార్పులు !

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఎఫెక్ట్‌… తెలంగాణ ఇంటర్‌ పరీక్షలపై పడింది. ఈ ఉప ఎన్నిక కారణంగా ఈ పరీక్షా తేదీల్లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్‌ 30 వ తేదీన హుజురాబాద్‌ ఉప ఎన్నిక జరుగనుంది. నవంబర్‌ 2 వ తేదీన ఉప ఎన్నిక ఫలితాలు వెలువడునున్నాయి. ఎన్నికల నిర్వహణ ముందు అంటే.. అక్టోబర్‌ 29 వ తేదీ మరియు 30 వ తేదీ లలో హుజురాబాద్‌ నియోజక వర్గంలో 144 సెక్షన్‌ విధిస్తారు.

అయితే… ఇంటర్మిడియేట్‌ బోర్డు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం… సెప్టెబర్‌ 24 నే ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ లెక్కన అక్టోబర్‌ 29 వ తేదీన ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ పరీక్షలు జరుగనుండగా.. 30 వ తేదీన.. కెమిస్ట్రీ, కామర్స్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. దీంతో పరీక్ష నిర్వహణ దాదాపుగా సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా విద్యాశాఖా ధికారులు ముందు.. ఆ తేదీన జరిగే పరీక్షలను వాయిదా వేయడం లేదా… సెంటర్లను తరలించడం… అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ పరీక్షలు వాయిదా వేస్తే… రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం పడుతుంది. అయితే… దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.