వాళ్ళు ఇద్దరూ ఏపీ కేబినేట్ లోకి పక్కా…?

-

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుంది. కొంత మంది మంత్రులను ముఖ్యమంత్రి జగన్ బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటికే వాళ్లకు సమాచారం కూడా వెళ్లిందని పార్టీ అగ్రనేతలు వాళ్ళతో మాట్లాడి మంత్రివర్గం నుంచి తప్పుకోవాలని చెప్పారని ప్రచారం ఉంది.

కొంతమంది స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత స్వచ్ఛందంగా రాజీనామా కూడా చేయాలని ఆదేశాలు వెళ్ళినట్టుగా ప్రచారం ఊపందుకుంది. అయితే ఇప్పుడు మంత్రివర్గంలోకి ఎవరు వస్తారు ఏంటనే దానిపై చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కచ్చితంగా క్యాబినెట్ లో వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల కోసం చాలా తీవ్రంగా కష్టపడ్డారు.

ఆయన నియోజకవర్గంలో పంచాయతీలు కానీ ఇప్పుడు మున్సిపాలిటీలు కానీ ఏకగ్రీవం అవుతున్నాయి. ప్రత్యర్థులు కనీసం పోటీల్లో కూడా నిలబడటానికి ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యమంత్రి జగన్ ఆయన పనితీరు విషయంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా ఇప్పుడు తను గురజాల నియోజక వర్గంలో తీవ్రంగా కష్టపడుతున్నారు. వీరిద్దరూ కూడా పోటా పోటీగా ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ముఖ్యమంత్రి జగన్ కూడా వీరిద్దరి పనితీరుతో సంతోషంగా ఉన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గం లో కూడా ఇంత దూకుడుగా ఏకగ్రీవాలు జరగలేదు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు క్యాబినెట్లోకి వస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news