ఎంత పెద్ద స్టార్ హీరో అయిన పెళ్లి చేసుకున్న తర్వాత భార్య సేవకుడే.. భార్య భర్తకు సేవకురాలే.. ఇంటి పనుల నుంచి, షాపింగ్ వెళ్తే బ్యాగులు మోయడం వరకూ..ఈరోజుల్లో ఇద్దరు సరి సమానమే..ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పరిస్థితి కూడా సేమ్ అలానే ఉంది. గ్లోబల్ స్టార్ అయితేనేం.. తన భార్యకు భర్తే కదా. తాజాగా ఆయన తన భార్య కాళ్లు నొక్కుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది..
అనంత్ అంబానీ వివాహానికి ఫ్లైట్లో వెళ్తున్న సమయంలో ఉపాసన కాళ్లకు మసాజ్ చేశారాయన. ఉపాసన టీమ్ ఆ వీడియోను ట్విటర్లో పంచుకుంది. భార్య పట్ల రామ్ చరణ్ చూపిస్తున్న కేరింగ్ చూసి వావ్ అంటూ నెటిజన్లు కొనియాడుతుండగా.. ఎంతటి స్టార్ అయినా భార్య కాళ్లు పట్టాల్సిందే అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా సరదా సెటైర్లు వేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం లో నటిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.