ఇంగ్లాండ్ వేదికగా వన్ డే టోర్నమెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న టాంటన్ వేదికగా సోమర్సెట్ మరియు ససెక్స్ జట్ల మధ్యన వన్ డే మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన సోమర్ సెట్ నిర్ణీత ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. సొమర్ సెట్ ఇన్నింగ్స్ లో ఉమీద్ మరియు కర్టిస్ క్యాంపర్ లు సెంచరీ లతో కదం తొక్కారు. 319 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన సస్సెక్స్ మరో 11 బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. ఇక తన జట్టును విజయ తీరాలకు చేర్చడంలో ఇండియన్ బ్యాట్స్మన్ ఛతేశ్వర్ పుజారా కీలక పాత్ర పోషించాడు. ఇతను 113 బంతుల్లో 11 ఫోర్ల సహాయంతో సెంచరీ (111) పరుగులు చేశాడు. కాగా పుజారాకు టామ్ అల్సప్ అర్ద సెంచరీ చేశాడు.
ఇప్పటికే పుజారా టెస్ట్ లలో ఫామ్ ను కోల్పోయి జట్టులో చోటును కోల్పోయాడు. ఇక ఈ ఇంగ్లాండ్ టోర్నమెంట్ లో అయినా నిలకడగా పరుగులు సాధించి జట్టులో స్థానాన్ని దక్కించుకుంటాడా చూడాలి.