రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో గెలవడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం శామీర్పేట్ పరిధి అనంతారంలో , కాంగ్రెస్ సహా పలు పార్టీల నాయకులు భారీ ఎత్తున లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ తో పెట్టుకున్న ఒక్కడూ బాగుపడలేదని, బండి సంజయ్ ఔట్ అయ్యాడని, వచ్చే నెలలో రేవంత్ రెడ్డి కూడా ఔట్ అయితాడని అన్నారు. హైదరాబాద్ సహా పట్టణాలు, గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
ఇది ఇలా ఉంటె, అధికార పార్టీ నాయకుల కోసం మంత్రి మల్లారెడ్డి ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్నారని టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి ఆరోపించారు. నాగారం మున్సిపల్‌లో వరద ముంపునకు గురవుతున్న 22 కాలనీల అసోసియేషన్లు జేఏసీగా ఏర్పడి శనివారం ప్రభుత్వానికి, మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని బిఎంఆర్ ఎన్‌క్లేవ్ నుంచి కాలనీల వాసులందరూ అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి కాలనీలలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి, మంత్రికి తమ నిరసనను తెలియజేశారు.