ఈ దేశంలో ప్రజల స్వేచ్ఛను హరిస్తూ, తమ స్వార్ధం కోసం అణగదొక్కుతున్న కొందరు పాలకులు, పెత్తందార్లకు వ్యతిరేకంగా ప్రజల రక్షణ కోసం పోరాడుతున్న మావోయిస్టుల గురించి తెలిసిందే. కానీ ఒకప్పుడు ఉన్న మావోయిస్టుల కన్నా ఇప్పుడు చాలా వరకు తగ్గాయనే చెప్పాలి. కానీ కొన్ని చోట్ల ఇప్పటికీ యాక్టీవ్ గా వర్క్ చేస్తున్నాయి. ఇక తాజాగా ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో డిప్యూటీ కమాండర్ హోదాలో పనిచేస్తున్న మావోయిస్టు సున్నూ మడవి అలియాస్ శివాజీ లొంగిపోయారు. చాలా కాలంగా పోలీసులకు దొరక్కుండా ఉన్న శివాజీ పైన ఛత్తీస్ ఘడ్ పోలీసులు ఇతని ఆచూకీ తెలిపితే రూ. 3 లక్షల రివార్డును ప్రకటించింది. అయితే కారణాలు ఏమిటన్నది తెలియకపోయినా తాజాగా ఛత్తీస్ ఘడ్ BSF పోలీసులకు లొంగిపోయాడు. ఇతను 2009 లో మదనవాడ ఎస్పీ వినోద్ చౌబోతే పాటు 29 మంది జవాన్ లపై దాడి చేసిన వారిలో ప్రథముడు కావడం గమనార్హం.
అలాగే 2006 లో దంతెవాడ లో ఎనిమిది మంది CISF జవాన్ లపై దాడి చేసిన వారిలో శివాజీ ఉన్నాడు. ఇంతకాలం తర్వాత తనకు తానుగా లొంగిపోవడంతో మావోయిస్టులు అంతా ఆశ్చర్యపోతున్నారు.