వరద ప్రభావంతో నిజామాబాద్​లో కొట్టుకుపోయిన మినీ వంతెన

-

రాష్ట్రంలో మూడ్రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వానలకు రాష్ట్రంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లోకి వరద నీరు రహదారులపైకి చేరి చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీటి వల్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు నేలకొరికి కరెంట్ సరఫరా నిలిచిపోయింది.

భారీ వర్షాలతో నిజామాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తుతోంది. గత రెండురోజులుగా కురుస్తున్న వర్షానికి డిచ్‌పల్లి మండలం మాధవనగర్‌ గుడి ఎదుట ఉన్న చిన్న వంతెన వర్షానికి కొట్టుకుపోయింది. బ్రిడ్జి కొట్టుకుపోవడంతో గుడి ఎదుట రాకపోకలు నిలిచిపోయి ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. ఆ ప్రాంతంలో ప్రయాణికులు 10 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్‌- కంటేశ్వర రోడ్డు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.

రైల్వే పైవంతెన నిర్మాణ పనులు నేపథ్యంలో తాత్కాలికంగా మినీ వంతెనను నిర్మించగా.. భారీ వాహనాలు అనుమతి లేకపోయినా ఆ బ్రిడ్జిపై నుంచి వెళ్లడంతో కొంతకాలం క్రితం వంతెన కుంగిపోయింది. ఇక ముడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంగళవారం రోజున భారీ వరద రావడంతో ఆ ప్రవాహానికి బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news