ఈ టీలతో PCOS, PCOD కి చెక్..!

-

టీ తాగడం వల్ల ఒత్తిడి దూరం అయ్యిపోయి ఎంతో రిలాక్స్ గా అనిపిస్తుంది. అదే విధంగా జ్వరం, జలుబు, ఫ్లూ వంటివి ఉన్నప్పుడు టీ తాగితే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. పైగా మనం ఎన్నో రకాల టీలని కూడా తయారు చేసుకోవచ్చు. కొందరు మహిళలు పిసిఓఎస్, పీసిఒడి సమస్యతో బాధ పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కూడా ఈ టీలు బాగా ఉపయోగపడతాయి.

చమోలి టీ:

పీసీఓస్, పీసీఓడీ తో బాధపడే మహిళలు చమోలి టీ తాగితే చక్కటి రిలీఫ్ ఉంటుంది. అదే విధంగా ఇది యాంగ్జైటీని కూడా దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. మూడ్ స్వింగ్స్ ని కంట్రోల్ చేస్తుంది.

పెప్పర్మెంట్ టీ:

రెగ్యులర్ గా పీరియడ్స్ రాని మహిళలు, పీసీఓస్, పీసీఓడీ తో బాధపడే మహిళలు పెప్పర్మింట్ టీ తాగడం వల్ల చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు. దీని వల్ల క్రామ్ప్స్, వికారం వంటి సమస్యలు కూడా దూరం అయిపోతాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి. జీర్ణ సమస్యలు కూడా ఇది తొలగిస్తుంది.

దాల్చిని టీ :

దాల్చిని కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గడానికి, పీరియడ్స్ లో బాధలు తొలగించడానికి దాల్చిన బాగా సహాయం చేస్తుంది.

అల్లం, తులసి టీ:

తులసి, అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అదే విధంగా ఇది వికారాన్ని పోగొడుతుంది. క్రామ్ప్స్ వంటివి కూడా ఈ తొలగించుకోవచ్చు.

లావెండర్ టీ:

కొంత మంది మహిళలకి రాత్రిపూట కడుపు నొప్పి విపరీతంగా ఉంటుంది. దీనితో నిద్ర అస్సలు నిద్ర పట్టదు. అటువంటి వాళ్ళు రిలీఫ్ పొందాలి అంటే కచ్చితంగా లావెండర్ టీ ప్రిపేర్ చేయడం మంచిది ఇది మంచి నిద్రనిస్తుంది అదే విధంగా రిలాక్స్ గా ఉంచుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news