కరోనా బాధితుడికి కిడ్నీ మార్పిడి… చెన్నై వైద్యుల అరుదైన ఘనత?

-

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ అంచనాలకు అందని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ శరీరంలోని ఊపిరితిత్తులపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. కరోనా రోగుల్లో చాలామంది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బారిన పడి మృతి చెందారు. వైరస్ నుంచి కోలుకున్న వారు సైతం ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడుతున్నట్టు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

అయితే తాజాగా చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు కరోనా బాధ పడుతున్న వ్యక్తి ఊపిరితిత్తులు మార్చి అరుదైన ఘనతను సాధించారు. ఊపిరితిత్తుల ఆపరేషన్ ను చేసి సక్సెస్ కావడం ఆసియా ఖండం చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే గురుగ్రామ్ కు చెందిన 48 ఏళ్ల బిజినెస్ మేన్ కరోనాతో బాధ పడుతూ ఆస్పత్రిలో చేరగా పరిస్థితి విషమించడంతో విమానంలో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

అక్కడ ఆయనకు ఎక్మో చికిత్స అందించారు. ఎక్మో చికిత్స వల్ల ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. అయితే అప్పటికే ఆయన ఊపిరితిత్తులు దెబ్బ తినడంతో బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి ఊపిరితిత్తులు ఈయనకు అమర్చారు. లంగ్స్ మార్పిడి చేయించుకున్న వ్యక్తి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. దేశంలో ఇప్పటివరకు 64,000కు పైగా కరోనా మరణాలు నమోదు కాగా వీళ్లలో ఊపిరితిత్తుల సమస్య వల్ల మృతి చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. కరోనా బాధితుల్లో లంగ్స్ లో కఫం చేరడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news