IPL 2023 : ధోని గేమ్ ప్లాన్..CSK లోకి గుంటూరు మిర్చి

-

నిన్న జరిగి ఐపీఎల్ 2023 మినీ వేలంలో చాలా రసవత్తరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇండియన్స్‌ కంటే, విదేశీ ప్లేయర్లపైనే కోట్లు కుమ్మరించాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఈ నేపథ్యంలోనే, ఐపీఎల్ 2023 వేలంలో ఊహించినట్లుగానే ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్లు సామ్ కరన్, బెన్ స్టోక్స్ అత్యధిక ధర పలికారు. ఈ నేపథ్యంలోనే, వేలంలో ఏకంగా రూ. 16.25 కోట్ల రూపాయలకు స్టోక్స్ ను కొనుగోలు చేసింది. ఇక ఆంధ్ర యువ ఆటగాడు షేక్ రషీద్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

శుక్రవారం జరిగిన ఐపిఎల్ 2023 మినీ వేలంలో రషీద్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2022లో అద్భుతంగా రాణించిన రషీద్ సిఎస్కే టాలెంట్ స్కౌట్ ల దృష్టిలో పడ్డాడు. ఈ ఏడాది ఐపిఎల్ లో రాయలసీమ కింగ్స్ తరపున ఆడిన రషీద్ 159 పరుగులు సాధించాడు. అదేవిధంగా 2022 అండర్-19 ప్రపంచ కప్ ను గెలుచుకున్న యువభారత జట్టుకు రషీద్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ప్రపంచ కప్ ముగిసిన అనంతరం జరిగిన ఐపిఎల్ 2022 మెగా వేలంలో రషీద్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షిస్తాడని అంతా భావించారు. కానీ కొన్ని కారణాలవల్ల రషీద్ తో పాటు పలువురు అండర్ 19 ఆటగాళ్లు మెగా వేలంలో పాల్గొనలేకపోయారు. కానీ ఐపీఎల్-2023 మినీ వేలంలో మాత్రం రషీద్ కళ నెరవేరింది. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్టుతోనే తన ఐపీఎల్ కెరీర్ ను మొదలుపెట్టనున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news