వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నుంచే తాను పోటీ చేస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి, టీడీపీ మహిళా నేత సుధారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి చంద్రగిరి రెండు స్థానాలు అయితాయని.. కచ్చితంగా తాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై పోటీ చేస్తానన్నారు. అవినీతి చేసిన చెవిరెడ్డి చట్ట ప్రకారం.. జైలుకు పోతాడన్నారు. చెవిరెడ్డి, ఆయన సతీమణి ఆస్తుల వివరాలను ఇంటింటికి కరపత్రాలు చేసి పంచుతానని హెచ్చరించారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద చెవిరెడ్డికి సుధారెడ్డి బహిరంగంగా ఫోన్ చేయగా.. ఆయన ఫోన్ లిప్ట్ చేయలేదు.
మీడియాతో మాట్లాడుతూ తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సుధారెడ్డి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నుంచే పోటీ చేస్తానని.. వచ్చే ఎన్నికల నాటికి చంద్రగిరి రెండు స్థానాలు అవుతాయి. కచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపైనే నేను పోటీ చేస్తాను. చంద్రబాబు కచ్చితంగా మహిళ గా నాకు అవకాశం ఇస్తారు. అవినీతి చేసిన చెవిరెడ్డి చట్ట ప్రకారం.. జైలుకు పోతారు. గత ఐదేళ్లుగా ఆడవాళ్లను అవమానిస్తూ వైసీపీ రాజకీయం చేసింది. ఎమ్మెల్యే నానిని ఎదుర్కొనే ధైర్యం లేక నా మీద ఆరోపణలు చేశారు.