ప్రజల కోసం కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి

-

ప్రజల శ్రేయస్సు కోసం దేవుళ్లకి పూజలు, ప్రార్థనలు చేస్తుంటారు కొందరు నాయకులు. కానీ ఓ నాయకుడు మాత్రం తన రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని ఏకంగా కొరడా దెబ్బలు తిన్నారు. నాయకుడు అంటే సాధారణ గ్రామ ప్రజాప్రతినిధి కాదు.. కనీసం జిల్లా నాయకుడు కూడా కాదు ఏకంగా ఓ రాష్ట్రానికి ప్రతినిధి. రాష్ట్ర ప్రజలను పాలిస్తున్న ముఖ్యమంత్రి. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరంటే..?

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ కొరడా దెబ్బలు తిన్నారు. మీరు విన్నది నిజమే. రాష్ట్రంలోని జజన్‌గిరి, కుమ్హారి గ్రామాల్లోని ఈ జానపద సంప్రదాయాన్ని సీఎం ప్రతి ఏడాది పాటిస్తారు. ఈ సారి కూడా ఈ వేడుకల్లో పాల్గొని దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు.

దీపావళి మరుసటి రోజు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో గౌరి-గౌర పూజ నిర్వహిస్తారు. దానిలో భాగంగా చెడును తరిమికొట్టేందుకు కొరడా దెబ్బలు కొడతారు. అన్ని విఘ్నాలు తొలగేందుకు రాష్ట్ర ప్రజల కోసం భూపేశ్ ఈ పూజల్లో పాల్గొని, మణికట్టుపై కొరడా దెబ్బలు తిన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news